- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral video: ఇలాంటి పోటీ 'నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్'.. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి!

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కోడి పందెలు (Cockfighting), తమిళనాడులో జల్లికట్టు (Jallikattu), కర్ణాటకలో ఎద్దుల రేసులు, రాజస్థాన్‌లో ఒంటెల పందెలు, అస్సాంలో బుల్‌బుల్ పోటీలు ప్రతి ఏటా జరుగుతుంటాయి. ఆయా ప్రాంతాల సాంప్రదాయానికి ప్రతీకగా కొన్నేళ్ల నుంచి వీటిని నిర్వహిస్తున్నారు. అందుకే ఈ పోటీలు జరుగుతున్నాయంటే.. ప్రజలు కూడా చూసేందుకు ఆయా ప్రాంతాలకు తరలివెళ్తుంటారు. కానీ, ఇప్పుడు చెప్పబోయే పోటీ గురించి తెలిస్తే మాత్రం 'నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్' అంటారు. ఇందులో పోటీదారులు, పోటీ నిర్వాకులు, ప్రేక్షకులు అందరూ ప్రత్యేకమే. మరీ ఈ పోటీ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
ఇక వీడియోలో ఏముందంటే.. కోడిపుంజులు (Cocks), కోళ్లు (Hens) గూమిగూడి ఉన్నాయి. మధ్యలో ఓ చిన్న ట్రే ఉంది. అందులో రెండు కుక్క పిల్లలు (Dogs) వీరోచితంగా పోటీ పడుతున్నాయి. ఎంతలా అంటే.. ఆ ట్రేలోంచి ఓ కుక్కపిల్లను మరో కుక్కపిల్ల బయటికి గెంటేసింది. అయినా ఓటమిని అంగీకరించకుండా లోపల ఉన్న కుక్కపిల్లను కూడా బయటికి లాగి మరీ ఫైట్ చేసింది. ఇక చివరికి ఓ కుక్కపిల్ల నేలపై పడిపోవటంతో పోటీ ముగిసినట్లుగా కొట్టుకోవటం ఆపేశాయి. ఇక ఈ వినోదాన్ని ప్రేక్షకుల్లాగా నిలబడి కోడిపుంజుల గుంపు ఎంజాయ్ చేస్తుంది. Nature is Amazing అనే ఎక్స్ ఖాతాలో 'కోళ్ల గుంపు ఇల్లీగల్‌గా కుక్కల పోటీలు నిర్వహిస్తున్నాయి' అనే క్యాప్షన్‌తో షేర్ చేయగా, నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫైట్, ఇలాంటి పోటీ ఎప్పుడు చూడలేదంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.