- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హక్కులడిగితే నిర్బంధమా.. ఆశా కార్యకర్తలు
దిశ, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా రూ.10వేల ఇవ్వాలని కోరుతూ గురువారం ఛలో కమిషనర్ కార్యాలయానికి బయలుదేరడానికి సిద్ధం అవువుతన్న కార్యకర్తలను పోలీసులు తెల్లవారుజామున 5గంటల నుంచే ఇండ్ల దగ్గరకు వెళ్లి బలవంతంగా అరెస్టులు చేసి వారిని ఆయా జిల్లా కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్‌కి తరలించడం దారుణమన్నారు. జిల్లాలో ఇప్పటికే కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, తెలుకపల్లి, తాడూర్, కల్వకుర్తి, వెలదండ, ఉరుకొండా, బలమూర్‌లలో అరెస్టులు జరిగాయన్నారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. వేతనాలు అడిగితే, హక్కులను ప్రశ్నిస్తే పోలీసు నిర్బంధం ప్రయోగిస్తూ, పోరాటాని అణిచివేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పోకడకు నిదర్శనాలుగా పేర్కొన్నారు. అరెస్టులను వెంటనే ఆపాలి, ఆశాలను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని, ఆశాలకు రూ.10వేల వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేస్తున్నామన్నారు. అక్రమ అరెస్టులను వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాల్లో రాస్తారోకోలు చేయాలని పిలుపునిచ్చారు.
tags : police arrested, hopes, Commissionarate Office, minimum salary, AP, TS, Asha Workers, mahaboobnagarThe police who arrested the hopes