వరంగల్‌లో వాహనదారులకు టెక్నాలజీతో చెక్

by Shyam |   ( Updated:2020-04-09 05:39:22.0  )

దిశ, వరంగల్: లాక్‌డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారులను కట్టడి చేసేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు కొత్త టెక్నాలజీని వినియోగంలోకి తెచ్చినట్టు కమిషనర్ రవీందర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అవసరం లేకున్న రోడ్ల మీదకు వస్తున్న కొందరు వాహనాదారులను కట్టడి చేసేందుకు రాష్ట్ర పోలీస్ విభాగం నూతనంగా సిటిజన్ ట్రాకింగ్ అప్లికేషన్ వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఈ అప్లికేషన్ ద్వారా రోడ్డు మీదకు వాహనదారుడు ఎన్నిసార్లు వచ్చాడు, ఎన్ని పోలీసు చెక్ పాయింట్లను దాటాడు వంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా చెకింగ్ పాయింట్ వద్దకు వచ్చే వాహనదారులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తారని తెలిపారు. సదరు వాహనదారుడు ఎన్నిమార్లు రోడ్ల మీదకు వచ్చాడు, ఎంత దూరం నుంచి వచ్చాడు, ఎన్ని చెక్ పాయింట్లను దాటి వచ్చాడనే సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. అనవసరంగా వస్తే వాహనదారునిపై చర్యలు తీసుకుని వాహనం సీజ్ చేస్తామన్నారు.

Tags : police, check, technology, motorists, warangal, commissionerate

Advertisement

Next Story

Most Viewed