- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనుమానాస్పద స్థితిలో మాజీ క్రీడాకారుడు మృతి
దిశ, కంటోన్మెంట్: మాజీ ఫుట్ బాల్ క్రీడాకారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ బోయిన్‌పల్లి చిన్నతోకట్ట అయ్యప్ప కాలనీ సొసైటీలో ఖాళీ ప్రదేశంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెంది ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధుడి వివరాల కోసం చుట్టుపక్కల పరిశీలించినా ఫలితం లేకపోవడంతో పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో స్థానికుల సమాచారం మేరకు సదరు వృద్ధుడు మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు సుందర్ (62) అని తేలింది. గత కొన్ని రోజుల క్రితం సుందర్ కుటుంబ సభ్యులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేస్ నమోదు చేసినట్లు తెలిసింది. అయ్యప్ప సొసైటీ కాలనీలోకి ఎలా వచ్చాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా వృద్ధుడు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.