- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సచిన్ టెండూల్కర్ కోరిక ఇదే..
దిశ, వెబ్ డెస్క్: కరోనాను ఎదుర్కోవడానికి, నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్యులు, ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న ప్రతి వనరును ఉపయోగించుకుంటూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ముంబయి కార్పొరేషన్ అంథేరిలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో కరోనా రోగుల చికిత్స కోసం ప్లాస్మా థెరపీ యూనిట్ ను క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన కరోనా నుంచి కోలుకున్న వారికి ఓ విన్నపం చేశారు. “కరోనా మహమ్మారి రూపంలో మనం కష్టమైన సవాలును ఎదుర్కొంటున్నాం. ఈ సందర్భంగా, మా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, మునిసిపల్ మరియు ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి విరామం లేకుండా కృషి చేస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు వ్యాక్సిన్ ను కనుగొనటానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా… ప్లాస్మా థెరపీ అనేది కరోనా రోగులకు చికిత్స చేయడానికి ఒక మార్గంగా అవతరించింది. కాబట్టి కరోనా నుండి కోలుకున్న వారు తమ ప్లాస్మా ను దానం చేసి, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను కాపాడాలని” అని సచిన్ కోరారు.