రోజురోజుకు తగ్గుతున్న కరోనా టెస్టుల సంఖ్య

by Shyam |
రోజురోజుకు తగ్గుతున్న కరోనా టెస్టుల సంఖ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా టెస్ట్‌లను నిర్వహించడంతో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కొనసాగుతుంది. రోజు రోజుకు కరోనా పరీక్షల సంఖ్య తగ్గిపోతోంది. వారం రోజుల క్రితం ఏప్రిల్ 26న 99,638 టెస్ట్‌లు నిర్వహించగా ఏప్రిల్ 30న 77,930 టెస్ట్‌లు, మే 1న 76,330, మే 2న 58,742 టెస్ట్‌లను మాత్రమే నిర్వహించారు. కరోనా టెస్టుల విషయంలో హైకోర్ట్ ప్రభుత్వానికి ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా అలసత్వం వహిస్తోంది.

గడిచిన 24గంటల్లో 5,695 కేసులు నమోదు కాగా, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 80,135కి చేరుకుంది. ఒక్క రోజులో 49మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 2,417కి చేరుకుంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1352 కేసులు నమోదుకాగా భద్రాద్రి కొత్తగూడెంలో 108, జగిత్యాలలో 190, కరీంనగర్‌లో 231, ఖమ్మంలో 121, మహబూబ్‌నగర్‌లో 221, మహబూబాబాద్ లో 119, మంచిర్యాలలో 165, మేడ్చల్‌మల్కాజ్‌గిరిలో 427, నాగర్‌కర్నూల్‌లో 132, నిజామాబాద్‌లో 258, పెద్దపల్లిలో 99, రాజన్నసిరిసిల్లాలో 79, రంగారెడ్డిలో 483, సంగారెడ్డిలో 249, సిద్దిపేటలో 238, వికారాబాద్‌లో 109, వరంగల్‌ అర్బన్‌లో 393 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ములుగులో 21, నారాయణపేటలో 28, జనగాంలో 37, జయశంకర్ భూపాలపల్లిలో 39, నిర్మల్‌లో 34, కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed