- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉద్యమ కారునికి అండగా ఉద్యమ నేత
దిశ, నర్సంపేట టౌన్: తెలంగాణ ఉద్యమంలో తనతో పాల్గొన్న యువకుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న ఉద్యమనేత, నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 25 వేల రూపాయలను ఆర్థిక సహాయం చేశారు. ఉద్యమకారుడు దుబ్బెటి మహేష్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ములుగు ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు పోలీస్ వలయాన్ని చేధించి నిరసన తెలిపి జైలుకు వెళ్లాడని, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఓయూ నుండి కేయూ వరకు జరిగిన విద్యార్థి పాదయాత్ర సైతం మహేష్ ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. అయితే మహేష్ ఇటీవల కాలంలో కరోనా బారినపడి వరంగల్ కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తన వంతు సహాయాన్ని అందజేశారు. అతనికి మెరుగైన వైద్య సహాయాన్ని అందజేయాలని డాక్టర్లకు సూచించారు. మహేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వాకబు చేస్తానని అండగా ఉంటానని హామీ ఇచ్చారు.