- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏది నిజం.. మంత్రి కేటీఆర్ ని వివాదాల్లోకి నెట్టిన మేయర్.. ట్విట్టర్లో రచ్చ..
దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ ని అభివృద్ధి చేసేందుకు రూ.5వేల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిలో దాదాపు రూ.3,866 కోట్లను జీహెచ్ఎంసీ పరిధిలో తాగు, మురుగు నీటి సరఫరాని మెరుగుపరిచేందుకు కేటాయిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, సీఎం కేసీఆర్ కి పాలాభిషేకం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ విషయంపై జీహెచ్ఎంసీ పరిధిలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఆమె చేసిన ట్వీట్ “ Thank you Hon’ble @TelanganaCMO KCR Garu & minister @KTRTRS GARU for allocating 5000 Cr for the development of Hyderabad city for the first time in the state history, of which 3,866 cr has been allocated for improving & setting up of 31 STP’s in @GHMCOnline limits.”అని చేశారు. అంటే హైదరాబాద్ అభివృద్ధికి రూ.5వేల కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు. జీహెచ్ఎంసీ చరిత్రలో అభివృద్ధికి 5వేల కోట్లు ఎప్పుడు కేటాయించలేదని ట్వీట్ సారాంశం.
దీనిపై నెటిజన్లు తీవ్రంగా చర్చ జరుపుతున్నారు. అందులో కొన్ని ట్వీట్స్ “ I remember @KTRTRS and other ministers constantly preaching in 2020 GHMC elections about 65000cr spent on Hyd since 2014 that calculates to an avg of 10000cr per year. Now you say allocating 5000cr is the highest ever till date. Who is wrong?”అని ఉంది. అంటే, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో గత ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ అభివృద్ధికి రూ.65వేల కోట్లు ఖర్చు చేశారని మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు ప్రజలకు చెప్పారు. అంటే 2014 నుంచి ఏడాదికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్లే కదా.. మరి మీరు జీహెచ్ఎంసీ చరిత్రలో 5 వేల కోట్లు ఖర్చు చేయడం ఇదే తొలిసారి అంటున్నారు. ఇందులో ఎవరిది కరెక్ట్ అని” ఉంది. దీనిపై మరో నెటిజన్.. “ఎలక్షన్ లో ఓట్లకోసం 65 వేల కోట్లు ఖర్చు చేశారని తప్పుడు ప్రచారాలు చేశారాన్న మాట”అని కామెంట్ చేశారు. దీంతో మేయర్ చేసిన ట్వీట్ తో మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు తప్పంటూ నెట్టింట విమర్శలు వస్తున్నాయి.
దీనిపై మరో నగరానికి చెందిన మహిళ చేసిన ట్వీట్ అందిరినీ ఆలోజింపచేస్తోంది. ఆ ట్వీట్ “ She teams unnay kani mahilala ku badratha undadu, Tower buildings lo police monitoring undi kani dongatanalu agavu, Fly overs kadataru kani traffic tippalu tappavu, Musi chuttu andala soyagam kani musi nillu darunam ,City chala peddadi kani parking ki pratyannamam undadu”అని చేశారు. అంటే షీ టీమ్స్ ఉన్నప్పటికీ మహిళలకు భద్రత ఉండటం లేదని, పోలీసుల మానిటరింగ్ ఉన్నా దొంగతనాలు ఆగటం లేదని, ఫ్లైఓవర్స్ కడుతున్నా ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదని, మూసి చుట్టూ అందాల సోయగాన్ని సృష్టించినా.. మూసీ నీళ్లు దారుణంగానే ఉంటాయని, సిటీ చాలా పెద్దది కానీ పార్కిగ్ కి ప్రత్యామ్నాయం ఉండదు అని ట్వీట్ సారాంశం. ఇలా ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలు చెబుతూ.. విమర్శిస్తున్నారు.
I remember @KTRTRS and other ministers constantly preaching in 2020 GHMC elections about 65000cr spent on Hyd since 2014 that calculates to an avg of 10000cr per year. Now you say allocating 5000cr is the highest ever till date. Who is wrong?
A. You B. @KTRTRS C. Both A & B 🙂— Kris (@phanikrishna_me) September 23, 2021