బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరుడు భగత్ సింగ్

by Shyam |
Bhagat Singh
X

దిశ, పరకాల: యువత భగత్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు మడికొండ శీను సూచించారు. మంగళవారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భగత్ సింగ్ 114వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శీను మాట్లాడుతూ.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప విప్లవ నేత భగత్ సింగ్ అన్నారు. భగత్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకొనే తెలంగాణ యువత స్వరాష్ట్ర సాధనకు ఉద్యమించారని గుర్తుచేశారు.

ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ యువకునికి భగత్ సింగ్ జీవితం స్ఫూర్తిదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, భద్రయ్య, నాగరాజు, లింగమూర్తి, చిరంజీవి, సారయ్య, జ్యోతి, అనిల్, స్రవంతి, రాజు, రజనీ, నవీన్, ఉమాదేవి, రఘుపతి, అవినాష్, వెంకటేష్, నరేష్, రమేష్, నాగరాజు, రాజేందర్, రాజు, కర్ణాకర్, ఆనంద్, బాబురావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story