ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం…ఇకపై పసుపు రంగు మాయం

by srinivas |
apsrtc bus
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు బస్సులకు రంగులు మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని జిల్లాల్లోని పల్లెవెలుగు బస్సుల రంగులను మార్చాలంటూ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఇకపోతే పల్లెవెలుగు బస్సులకు ప్రస్తుతం ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు ఉన్నాయి. వీటిలో పసుపు రంగును మాత్రం తొలగించాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పసుపు రంగు స్థానంలో గచ్చకాయ రంగును వేయాలని సూచించారు. అలాగే రంగులకు సంబంధించి డిజైన్‌ను కూడా మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story