- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమరులు కోరుకున్న తెలంగాణ రాలేదు : ఈటల
దిశ, తెలంగాణ బ్యూరో : అమరవీరులు కోరుకున్న స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య తెలంగాణ, మనిషిని మనిషిగా గౌరవించే తెలంగాణ రాలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య 12 వ వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో నిర్భంధాలు, అణచివేతలు, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు. తెలంగాణలో స్వేచ్ఛగా ఒక వ్యక్తి ఏ రాజకీయ పార్టీలో ఉండాలో నిర్దేశించుకునే హక్కు లేదని, ఒక పౌరుడు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు కేసీఆర్ ఏ ఉద్యమాన్ని నమ్ముకున్నారో.. అదే కేసీఆర్ ఈనాడు ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. యావత్ తెలంగాణ ప్రజలు జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నారని, ఆత్మగౌరవం కోసం మరో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారని అన్నారు.