రాయలసీమ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు

by Shyam |
High court
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఏపీ సర్కార్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విచారణ చేపట్టేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. ఈ ఎత్తిపోతలపై సోమవారం ఏఐసీసీ కార్యదర్శి, వంశీ‌చంద్‌రెడ్డి, గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లు లిస్ట్ చేసేందుకు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు నేతృత్వంలోని బెంచ్ అంగీకరించింది. కేంద్రం, కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆదేశించినప్పటికీ ఏపీ ముందుకు వెళ్తోందని, టెండర్లు ఖరారు చేసిందని బెంచ్‌కు పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వివరించారు. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 84కు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని, శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందంటూ ఏపీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ తర్వాత సోమవారం విచారణ చేపట్టాలని ఏపీ న్యాయవాది కోరారు. దీంతో రాయలసీమ ఎత్తిపోతల కేసును ఈనెల 24న లిస్ట్ చేసేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణ ఏడాదిరిగా మారుతుందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం టెండర్లు ఖరారు చేశారని వెల్లడించారు. ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతలకు అడ్డు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed