ప్రమాదానికి నిలయాలుగా ట్రాన్స్ ఫార్మర్లు

by Sumithra |
ప్రమాదానికి నిలయాలుగా ట్రాన్స్ ఫార్మర్లు
X

దిశ, కొత్తూరు : మండలంలో కొన్ని చోట్ల చేతికందే ఎత్తులో ట్రాన్స్ ఫార్మర్ల దిమ్మెలు ఉండటం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ కంచె వెయ్యాలని ఎన్నోమార్లు అధికారులకు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్, పెంజర్ల రోడ్డులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదభరితంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.


Advertisement
Next Story

Most Viewed