కడుపులో తల ఇరుక్కుపోయి..

by srinivas |
కడుపులో తల ఇరుక్కుపోయి..
X

అమరావతి: కడుపులో తల ఇరుక్కుపోయి శిశువు మృతి చెందిన దారుణ ఘటన మంగళవారం కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. జిల్లాకు చెందిన ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. కాన్పు చేసే క్రమంలో వైద్యులు శిశువును బయటకు లాగగా, మొండెం ఊడిపోయి, తల కడుపులోనే ఇరుక్కుపోయింది. దీంతో మహిళను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆపరేషన్ చేసి తలను బయటకు తీశారు. అయితే, శిశువు మృతికి నంద్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులే కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags : head, stuck, stomach, baby, dead, karnool, docter, Pregnant

Next Story

Most Viewed