- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటలను ఆర్థిక దిగ్భంధం.. వ్యాపారాలపై పెరిగిన నిఘా
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను ఆర్థిక దిగ్భంధంలో పెడుతున్నారు. ఆయన ఆదాయానికి బ్రేక్ వేస్తూనే ఈటల వ్యాపార లావాదేవీలపై ప్రభుత్వం నిఘా పెంచింది. ప్రస్తుతం హుజురాబాద్‌కు ఉపఎన్నిక రానున్న నేపథ్యంలో నిఘాను మరింత పెంచారు.
ఐఎంఎల్ డిపో క్లోజ్
ఈటల రాజేందర్ భూ అక్రమణ ఆరోపణలు ఎదుర్కొన్న దేవరయాంజల్లో ఈటల రాజేందర్‌కు కొన్నేండ్ల నుంచి లిక్కర్ ఐఎంఎల్ డిపో ఉంది. హైదరాబాద్ రేంజ్ –2, రంగారెడ్డి జిల్లాలోని కొంత పరిధికి ఈ ఐఎంఎల్ డిపో నుంచే లిక్కర్ సరఫరా అవుతోంది. అయితే దేవరయాంజల్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆయన వ్యాపారాలపై దృష్టి పెట్టారు. వచ్చే హుజురాబాద్ ఉపఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు పెడుతారనే ప్రచారం నేపథ్యంలో ఈటలను ఆర్థికంగా కట్టడి చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా ఐఎంఎల్ డిపోను మూసివేశారు. డిపోను మూసివేయమే కాదు… అది అక్రమ నిర్మాణంలో ఉందంటూ మొత్తం కూల్చి వేశారు. దీంతో ఈటలకు ప్రతినెలా రూ. 20 నుంచి రూ. 40 లక్షల ఆదాయం వచ్చే ఐఎంఎల్ డిపో మూతపడింది.
లెక్కలపై నిఘా
ఇక ఈటల వ్యాపారాలు, ట్యాక్స్‌లపై వాణిజ్య పన్నుల శాఖ కూడా రంగంలోకి దిగింది. ఏండ్ల నుంచి జమునా హాచరీస్ సమర్పిస్తున్న ట్యాక్స్‌ల వివరాలు, సాగుతున్న వ్యాపారాలపై మొత్తం విచారణ చేస్తున్నారు. మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఎన్ని యూనిట్లు పని చేస్తున్నాయి, వాటి నుంచి ఉత్పత్తి, అమ్మకాలు, యాజమాన్యం సమర్పిస్తున్న లెక్కల పత్రాలను పరిశీలిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కొన్ని రోజులుగా ఇదే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల మరింత కఠినంగా ఆరా తీస్తున్నారు. మొత్తం సాగుతున్న వ్యాపారం, త్రైమాసికంగా సమర్పిస్తున్న పన్నుల లెక్కలను పరిశీలిస్తున్నారు. అయితే జమునా హేచరీస్‌కు సంబంధించిన కొన్ని జరిమానాలు కూడా వేసినట్లు తెలుస్తోంది. కానీ వివరాలను బయటకు వెల్లడించడం లేదు.
ఉప ఎన్నిక కోసమే..!
హుజురాబాద్ ఉప ఎన్నికను గులాబీ అధిష్టానం ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమవుతూనే ఉంది. గులాబీ శ్రేణులు మొత్తం కరీంనగర్లో మోహరించారు. అదే సమయంలో ఈటలను ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు పోలీసులకు కూడా ప్రభుత్వం తరుపున స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈటల వెంట ఉండే ప్రతి వాహనం, ప్రతి నేతపై దృష్టి పెట్టారు. గ్రామస్థాయి నేతలపై కూడా పోలీసులు కన్నేశారు. ఆర్థికంగా వీక్ చేస్తే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవనే నెపంతో ప్రభుత్వం ఆర్థిక దిగ్భందం చేసే చర్యలు చేపట్టినట్లు హుజురాబాద్‌లో ప్రచారం జరుగుతోంది.