- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘టీ-సేవ’తో ప్రభుత్వానికి సంబంధం లేదు
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఈ-సేవ, మీ-సేవ మాదిరిగానే పేర్లను ఉపయోగించి ప్రకటనలతో తప్పుదారి పట్టిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ప్రజలు, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మీ-సేవ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల వ్యక్తులు ‘టీ-సేవకేంద్రాలు’ తెరవడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, టికెట్ బుకింగ్స్, బిల్ చెల్లింపులు, డబ్బు ఉపసంహరణ వంటి ఆన్‌లైన్ సేవలను అందుబాటులో ఉంటాయని పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారని వాటిని నమ్మోద్దని కోరారు.
ప్రైవేటు వ్యక్తుల టార్గెట్ నిరుద్యోగులను ఆకర్షించడమేనని, ప్రకటనలు నమ్మి మోసపోవద్దని సూచించారు. టీసేవ కేంద్రాలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అది ప్రభుత్వ సంస్థ కాదన్నారు. కేవలం ఈ-సేవ, మీ-సేవలు మాత్రమే ప్రభుత్వ సంస్థలు అని తెలిపారు.
Next Story