- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేసుడే.. మరోసారి మల్‌రెడ్డి రంగారెడ్డి అల్టిమేటం

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion)పై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తూ.. ఢిల్లీలో వాళ్ల శక్తి మేర లాబీయింగ్ చేస్తున్నారు. అయితే, మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) నుంచి తనకు అవకాశం కల్పించాలంటూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Ranga Reddy) ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన ఏఐసీసీ (AICC) పెద్దలకు కూడా లేఖ రాశారు.
తాజాగా, ఇవాళ ఆయన మంత్రి పదవిపై మరోసారి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో దుమారం రేపుతున్నాయి. తనకు ఒకవేళ మంత్రి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) నియోజకవర్గంలో తన స్థానంలో మరో సామాజికవర్గానికి చెందిన వారిని నిలబెట్టి గెలిపిస్తానని అన్నారు. అప్పుడైనా వాళ్లకు మంత్రి పదవి ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ అధికార పార్టీలో ఇరకాటంలో నెట్టేశాయి. రాష్ట్ర అధికాయకత్వంతో పాటు ఢిల్లీ పెద్దలు మల్‌రెడ్డి రంగారెడ్డికి కేబినెట్‌లో చోటు కల్పిస్తారా లేక మొండిచేయి చూపిస్తారా అనేది వేచి చూడాల్సిందే మరి.