భారత్ లో భూకంపాలు వచ్చే ప్రదేశాలు ఏంటో తెలుసా?

by Naveena |
భారత్ లో భూకంపాలు వచ్చే ప్రదేశాలు ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో కొన్ని ప్రాంతాలు అధిక తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశమున్న ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము-కాశ్మీర్ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్‌లోకి వస్తాయి. ఇక్కడ 9 తీవ్రతతో కూడిన భూప్రకంపనలు సంభవించే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్రలో భూకంప తీవ్రత 8 వరకు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్, కొంకణ్ తీర ప్రాంతాలు 7 తీవ్రతతో భూప్రకంపనలు ఎదుర్కొనే ప్రమాదంలో ఉన్నాయి.

అలాగే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 7 కంటే తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. అయితే, ఇవికూడా భూకంప ప్రభావానికి పూర్తిగా రక్షితమైన ప్రాంతాలు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు, ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. భూప్రకంపనలు సంభవించే ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed