- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ సినిమా హిట్ అవుతుందని ఊహించలేదు.. చాలా భయపడ్డానంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ (వీడియో)

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జువాల్కర్(Priyanka Juwalkar) ‘టాక్సివాలా’(Taxiwaala) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం 2018లో వచ్చి హిట్‌గా నిలిచింది. దీంతో పలు సినిమాల్లో ప్రియాంక నటించింది కానీ అంతగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. ఇక ఇటీవల ‘మ్యాడ్ స్వ్కేర్’(Mad Square) మూవీలో ఐటమ్ సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను సినిమాలు ట్రై చేస్తున్న సమయంలో నాకు విజయ్ దేవరకొండ సరసన అవకాశం వచ్చింది. దీంతో ఒక వారం రోజుల షూటింగ్ పూర్తయ్యే వరకు నేను ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. అయితే ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్‌లో వస్తుంది. పెద్ద కంపెనీలో నాకు మొదటి చిత్రం అసలు ఆ ప్రాజెక్ట్‌లో ఉంటానో లేక మధ్యలోనే తీసేస్తారేమో అనే భయం ఉండేది.
అందుకే షూటింగ్ స్టార్ అయిన వారం రోజుల తర్వాత మా ఇంట్లో చెప్పాను. అసలు ఈ సినిమా హిట్ అవుతుందని అనుకోలేదు.మాటే వినదుగా సాంగ్ నన్ను వదలదుగా!’’ అని చెప్పుకొచ్చింది. ఇక యాంకర్ ఆ తర్వాత వచ్చిన గ్యాప్ గురించి ప్రశ్నించగా.. అంత గ్యాప్ వస్తుందని నేను కూడా ఊహించలేదు. నాకూడా వరుస సినిమాలతో బిజీగా ఉండాలని ఉంటుంది. కానీ ఆఫర్లు రాలేదు. నేను సినిమా ఓకే చేసే ముందు స్టోరీ వింటాను. అప్పుడే చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతాను. ప్రొడక్షన్, డైరెక్టర్, యాక్టర్ ఎవరిని తెలుసుకుంటాను. నేను కొత్త ప్రొడక్షన్‌లో కూడా చేశాను. అయితే ఆ ఆలోచన నాది కాదు. విజయ్ దేవరకొండ ఊకే చెప్పడం వల్ల స్టోరీనే నీ హీరో అని చెప్పేవాడు. ఆ తర్వాత నుంచి స్టోరీ విని ఓ జడ్జ్‌మెంట్‌కు వచ్చేదాన్ని’’ అని సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ప్రియాంకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.