క్రిస్మస్ కు షాక్.. చర్చిల పై కొత్త ఆంక్షలు..

by Shamantha N |   ( Updated:2021-12-24 09:09:17.0  )
క్రిస్మస్ కు షాక్.. చర్చిల పై కొత్త ఆంక్షలు..
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వాలు ఆంక్షలు మొదలు పెట్టాయి. శనివారం క్రిస్మస్ సందర్భంగా భారీగా జనాలు గుమిగూడే అవకాశం ఉంది. అందుకోసం ఒడిశా సీఎం కొత్త ఆంక్షలు విధించారు. కొత్త సంత్సరం వేడుకలను రద్దూ చేస్తూనే, క్రిస్మస్ పండుగ పై ఆంక్షలు పెట్టింది అక్కడి ప్రభుత్వం.

చర్చిలో ప్రార్ధనలు చేసుకోవడానికి కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకూ ఈ నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొంది. వివాహాలు తప్పా అన్ని వేడుకలకు, వినోదాలకు అనుమతి లేదని తెలిపింది. అంతేకాదు, ర్యాలీలు, బంద్ లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, పార్కులు, హోటళ్లు, సమావేశాలు అన్నిటిని నిషేదించింది.

Advertisement

Next Story