వాగులో పడి మేకల కాపరి మృతి

by Shyam |
వాగులో పడి మేకల కాపరి మృతి
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదూరావుపేటకు చెందిన అయిటిపాముల నరేష్(23) అనే మేకల కాపరి ప్రమాదవశత్తు వాగులో పడి మృతిచెందాడు. స్థానిక ఎస్​ఐ ఇస్లావత్​ నరేష్​ వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం నరేశ్ మేకలను తీసుకొని అడవికి వెళ్లాడు. రాత్రివరకూ ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు అడవికి వెళ్లి వెతకగా, వాగులో శవమై కనిపించాడు. శవానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్టు ఎస్​ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story