సీఎం కీలక ప్రకటన.. రేపటి నుంచి లాక్ డౌన్

by Shamantha N |
సీఎం కీలక ప్రకటన.. రేపటి నుంచి లాక్ డౌన్
X

పనాజీ: కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే నిర్ణయం తీసుకుంది. గురువారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలుచేయనున్నట్టు ప్రకటించింది. ఈ సమయంలో ప్రజా రవాణా, క్యాసినోలు, ఇతర వినోద స్థలాలు మూసేయనున్నట్టు తెలిపింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయని వివరించింది. మార్కెట్ ప్లేస్‌లూ మూసేస్తామని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. మరో పదిరోజుల్లో రోజుకు 200 నుంచి 300 కరోనా మరణాలు చోటుచేసుకునే ముప్పు ఉన్నదని, నెల పొడుగు లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే సోమవారం అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed