- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానాస్పదంగా అన్న మృతి.. తమ్ముడి ఇంటిముందు ధర్నా
దిశ, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గారంపల్లి సాంబశివరావు (60) అనే రైతు అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి మృతి చెందాడు. గ్రామ శివారులోని బోటి (గుట్ట) సమీపంలో సాంబశివరావు మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే సాంబశివరావు తన తమ్ముడైన శ్రీకాంత్ తో గత కొంత కాలంగా భూ వివాద తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాంబశివ రావును శ్రీకాంత్ హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, శ్రీకాంత్ ఇంటి ముందు శవంతో ధర్నాకు దిగారు.
విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీరాములపల్లి గ్రామానికి చేరుకుని ధర్నాను విరమించాలని ప్రయత్నించగా, గ్రామస్తులంతా ఏకమై సాంబశివరావుకు రావాల్సిన భూమిని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించి, నష్టపరిహారంగా రూ.50 లక్షల రూపాయలను ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా సాంబశివరావుకు చెందిన వ్యవసాయ భూమిని శ్రీకాంత్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సాంబశివరావుది హత్యా.. ఆత్మహత్యా..? అనే అనుమానాలు గ్రామస్థుల్లో తలెత్తుతున్నాయి.