- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG: రోజురోజుకూ లేట్ అవుతున్న ఆ ఉద్యోగుల శాలరీలు.. సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘ప్రజాపాలనలో ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు అందజేస్తున్నాం’’.. అని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు ఇవి.. సీఎం రేవంత్‌రెడ్డియే కాకుండా మంత్రులందరూ అక్కడక్కడ చేస్తున్న ప్రకటనలు ఇవి. కానీ, తీరా చూస్తే గురుకుల విద్యాసంస్థల్లో మాత్రం ఉద్యోగులు సమయానికి వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. పదో తారీఖు వచ్చినా జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 50 వేల మంది వరకు ఉద్యోగులు..
సంక్షేమ గురుకుల విద్యా సంస్థల పరిధిలోని ఒక్కొక్క ఇన్సిస్ట్యూషన్ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో పది నుంచి పదిహేను వేల మంది మొత్తంగా 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతోపాటుగా పార్ట్ టైం, గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్టు పద్ధతిలో వర్క్చేస్తున్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లోని ఉద్యోగులకు దాదాపు రెండు నెలలుగా వేతనాలు ఆలస్యం అవుతున్నాయి.
అసలు సమస్య ఎక్కడా?
తెలంగాణ ప్రభుత్వం ఖజానాలో డబ్బులేకపోవడం వల్లనే గురుకులాల ఉద్యోగుల జీతాలు టైమ్ కు రాకపోవడం లేదా.? లేక సమన్వయ లోపంతోనే వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందా.? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదీలా ఉంటే జీతాలు చెల్లింపులపై ఎలాంటి స్పష్టత లేకపోవడం, నిర్దిష్ట సమయంలో కాకుండా ఇష్టానుసారంగా వేతనాలు ఇస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని ఎంప్లాయిస్ పేర్కొంటున్నారు.
సిబిల్ స్కోర్‌పై ఎఫెక్ట్
నిజానికి జీతాలు టైమ్‌కు అందకపోవడం వల్ల ఇంటి కిరాయిలు, వెహికిల్లోన్లు, ఇతరత్రా నెలనెలా చెల్లింపులు చేయలేకపోతున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రధానంగా సరైన సమయానికి లోన్లు చెల్లించడం లేట్ అవుతుండడంతో తమ సిబిల్ స్కోర్పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని గురుకుల విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు అందజేయాలని కోరుతున్నారు.