మామను చంపిన కేసులో అల్లుడికి 5 ఏళ్ల శిక్ష..

by Sumithra |
మామను చంపిన కేసులో అల్లుడికి 5 ఏళ్ల శిక్ష..
X

దిశ, కామారెడ్డి రూరల్ : మామను చంపిన కేసులో అల్లుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కామారెడ్డి 9వ అదనపు జిల్లా జడ్జి రమేష్ బాబు శుక్రవారం తీర్పు ఇచ్చారు. కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఎనుగుర్తి రాజలింగం అనే వ్యక్తిని అతని సొంత అల్లుడు లక్ష్మణ్ హత్య చేసిన సంఘటనలో ఈ తీర్పు ఇచ్చారు. మామా అల్లుళ్ళ మధ్య విభేదాలు, మనస్పర్ధలు పెరిగి మద్యం మత్తులో మామను గొడ్డలితో హత్య చేసిన విషయంలో దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి పై చార్జిషీటు దాఖలు చేశారు.

సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా వారి వాంగ్మూలంతో ఏకీభవించిన కోర్టు, నిజం రుజువు కావడంతో నిందితునికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నంద రమేష్ కేసు వాదనలు వినిపించారు.

Advertisement

Next Story

Most Viewed