- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. టీపీసీసీ చీఫ్‌పై ప్రకటన?
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా అన్నీ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా 15కు పైగా పార్టీలతో సమావేశం నిర్వహిచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్‌ను బలహీనపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయ్యింది. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు, ఇతర అంశాలపై చర్చించి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరుగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లతో పాటు, పీసీసీ అధ్యక్షులు వర్చువల్‌గా జరిగే ఈ సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. అంతేగాకుండా.. ఈ సమావేశం అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు టీపీసీసీ ఎంపికపైనా ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎవరన్న ఉత్కంఠకు కూడా ఇవాళే తెరదించే అవకాశం ఉంది.