- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
by Shyam |

X
దిశ, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ ధర్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న చికిత్సలను, పలు రకాల రికార్డులను ఆయన పరిశీలించారు. రోగులు, వారికి అందుతున్న సేవలను గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సేవలకు హైదరాబాద్ ఎందుకు పంపిస్తున్నారని వైద్యులను ప్రశ్నించారు. వైద్యాధికారుల పనితీరు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అందుతున్నసేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ చంద్రశేఖర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags: medak collector dharma reddy, checked, hospital, medak, Hospital records
Next Story