- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కంటైన్‌మెంట్ ఏరియాల్లో కలెక్టర్ పర్యటన
దిశ నల్గొండ: కరోనా నివారణ నేపథ్యంలో గుర్తించిన కంటైన్‌మెంట్ ప్రాంతాల ప్రజలు ఇంటికే పరిమితం కావాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆయా ఏరియాల్లో కాలి నడకన తిరిగి వైద్య పరీక్షల నిర్వహణపై ఆరా తీశారు. ఇంటి వద్దకే కూరగాయలు, నిత్యావసర వస్తువుల సరఫరా జరుగుతుందా లేదా అని తెలుసుకున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ఇంటి కుటుంబ సభ్యులతో కలెక్టర్ మాట్లాడారు. వారి వైద్య పరీక్షలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో బాధిత కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలు ఉంటే వెంటనే ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కోరారు.
tag: Collector prashanth jeevan patil, visit, Containment Areas, nalgonda