వాళ్లకు కరోనా టెస్టులు అక్కర్లేదు: కేంద్రం

by Shamantha N |
Vaccination
X

న్యూఢిల్లీ: ప్రతి రోజూ మూడు, నాలుగు లక్షల కొత్త కేసులు నమోదవుతున్న సందర్భంలో టెస్టులు చేసే ఆరోగ్య కేంద్రాలపై ఒత్తిడిని తగ్గించే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. వేగంగా పెరుగుతున్న కేసులతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 2500 ల్యాబ్‌లపై తీవ్ర ఒత్తిడి ఉన్నదని పేర్కొంది. వాటిపై ప్రెషర్ తగ్గించడానికి టెస్టుల నుంచి కొందరిని మినహాయించింది. రాష్ట్రాలు దాటి వచ్చే అందరికీ టెస్టులు చేయాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆరోగ్యవంతులైన ఇతర రాష్ట్రాల వారికి చేయాల్సిన అవసరం లేదని వివరించింది. వీరితోపాటు కింద పేర్కొన్నవారికీ టెస్టులు చేయాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో వివరించింది.

– కరోనా బారిన పడి రికవరీ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేవారికి టెస్టులు అవసరం లేదు.

– పదిరోజులు ఐసొలేషన్‌లో ఉండి డిశ్చార్జ్‌కి మూడు రోజుల ముందు నుంచి జ్వరం లక్షణాలు లేకుంటే వారికి టెస్టులు చేయాల్సిన పనిలేదు.

– ఒకసారి ర్యాపిడ్ లేదా ఆర్టీ పీసీఆర్ టెస్టులో పాజిటివ్ అని తేలినవారికీ మళ్లీ టెస్టులు వద్దు.

– ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆరోగ్యవంతులకూ టెస్టులు అనవసరం.

Advertisement

Next Story

Most Viewed