తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక నిర్ణయం

by Shamantha N |
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో : వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డారు. వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం, ఎలా కొనరో మేము చూస్తామంటూ ప్రతిపక్షాలు రైతులను ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చే విధంగా ఖరీఫ్ సీజన్‌లో మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా సేకరించేందుకు నిర్ణయించినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. తాజా నిర్ణయంతో ఖరీఫ్ సీజన్లో మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం తీసుకోనుంది.

Advertisement

Next Story

Most Viewed