'బీ.1.617' ఇండియన్ వేరియంట్ అని డబ్ల్యూహెచ్ఓ అనలేదు – కేంద్రం

by vinod kumar |   ( Updated:2021-05-12 10:15:02.0  )
బీ.1.617 ఇండియన్ వేరియంట్ అని డబ్ల్యూహెచ్ఓ అనలేదు – కేంద్రం
X

న్యూఢిల్లీ: బీ.1.617 కొవిడ్ వేరియంట్‌‌కు ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని డబ్ల్యూహెచ్ఓ ఎక్కడా అసోసియేట్ చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రపంచానికి ఇండియన్ వేరియంట్ కరోనా ఆందోళనకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)ప్రకటించిదని పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. కాగా మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్రం మండిపడింది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రచురించిన 32 పేజిల డాక్యుమెంట్‌లో అసలు ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని ఉపయోగించలేదనీ స్పష్టం చేసింది. ఈ విషయంలో మీడియా కేవలం నిరాధారంగా మాత్రమే వార్తలు రాసిందని కేంద్రం వెల్లడించింది. కేవలం మీడియా సంస్థలు మాత్రమే ఇలాంటి పదాలను ఉపయోగి స్తున్నాయని చెప్పింది. కాగా దీనిపై డబ్ల్యూహెచ్ఓ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించింది. తాము వైరస్‌లను, వాటి వైవిధ్యాలను అవి మొదట కనుగోబడిన దేశాల పేర్లతో గుర్తించడం లేదని పేర్కొంది. కేవలం శాస్త్రీయ నామాల ఆధారంగానే వాటిని గుర్తిస్తున్నట్టు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed