- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ ఆశావహులలో అలజడి
దిశ ప్రతినిధి, హైదరాబాద్: మహా నగర పాలక సంస్థ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో ఆశావహులలో అలజడి మొదలైంది. ప్రస్తుత పా లక మండలి గడువు ఫిబ్రవరి 10 వ తేదీతో ముగియనుంది. దీంతో డిసెంబర్ లేదా జనవరి నెలలో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు వార్డుల వారీగా ఓటర్ లిస్టుల తుది జాబితా కూడా రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమవ్వడంతో గ్రేటర్ పరిధిలో ఎన్నికల చర్చలు మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ప్రభుత్వం విడుదల చేయడంతో ఇప్పటి వరకు సందిగ్ధంగా ఉన్న వారిలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.
రిజర్వేషన్ కుదిరింది….
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బరిలో నిల్చోవాలని తలచిన అభ్యర్థులకు ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఎలా ఉంటాయోననే ఆందోళన ఉండేది. అయితే ప్రభుత్వం గ్రేటర్ లోని 150 డివిజన్లకు రిజర్వేషన్లు ప్రకటించింది. ఇందులో భాగంగా 75 సీట్లను మహిళలకు కేటాయించారు. వీటిల్లో ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళలకు ఒక్కో డివిజన్ కేటాయించగా ఎస్సీ జనరల్ 5, ఎస్సీ మహిళలు 5, బీసీ జనరల్ 25, బీసీ మహిళలకు 25 డివిజన్లను రిజర్వేషన్ల కింద కేటాయించారు. ఇవే కాకుండా మహిళలకు 44 డివిజన్లు, మరో 44 డివిజన్లను అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉంచారు. రిజర్వేషన్ల ప్రక్రియ అనుకూలంగా ఉన్న డివిజన్లలో ఆశావహులు అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. దీంతో అప్పుడే ఎన్నికల సందడి కనిపిస్తోంది.
ఓటర్ల నమోదుకు చర్యలు…
గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటర్ గా పేరు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఎన్నికల బరిలో నిల్చోవాలనుకునే అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ జాబితాలో చేర్చేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా బస్తీలలో వ్యక్తిగత సర్వే నిర్వహించి తమకు ఓటు వేస్తారనుకునే వారి వివరాలు సేకరించి ఓటర్ గా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎలాగైనా ఈ పర్యాయం కార్పొరేటర్ పదవి కోసం ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరిక్షించుకోవాలను తలంపుతో పావులు కదుపుతున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ వరకు ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా అన్ని డివిజన్లకు సంబంధించి ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల బాధ్యతలను జీహెచ్ఎంసీ అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు అప్పగించారు. వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా ప్రచురణ గడువు ఈ నెల 13వ తేదీతో ముగియనుంది.
బస్తీలలో మొదలైన ప్రచారం…
రాబోయే గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగాలనుకునే అభ్యర్థులు ఇప్పటికే బస్తీలలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. హామీలు ఇస్తున్నారు.