- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి బీజేపీ కృషి…

దిశ, ఖమ్మం: అట్టడుగున ఉన్న వర్గాల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తమిళనాడు సహాయ ఇంచార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. 'గావ్ చలో... బస్తీ చలో అభియాన్' కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేసి అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు. గావ్ చలో.. బస్తీ చలో కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అనేక రంగాల్లో పరుగులు తీస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.