- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
by Sumithra |

X
దిశ, కుత్బుల్లాపూర్ : గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం…. గాజులరామారం సర్కిల్ హెచ్ఎంటీ అటవీ ప్రాంతం బాలానగర్ డీసీపీ కార్యాలయం వెనుకభాగంలో ఓ కుళ్లిన మృతదేహమున్నట్లు స్థానికులు పోలీసులకు శనివారం సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా మహిళగా గుర్తించారు. 20 రోజుల క్రితం చనిపోయినట్లు నిర్దారించారు.
అయితే ఎవరైనా అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసి పడేశారా… లేక ఇంకేదైనా కారణం ఉందా..? తెలియడం లేదు. ప్రతి రోజు కొందరు వాకింగ్ చేసేందుకు వస్తారని, అలా వచ్చి కింద పడి చనిపోయిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story