- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైక్.. వ్యక్తి మృతి
దిశ, చిట్యాల: రోడ్డుపై ఎలాంటి సిగ్నల్స్ లేకుండా నిర్లక్ష్యంగా నిలిపి ఉన్న వాహనాన్ని ద్విచక్ర వాహనంతో వెనుకనుండి ఢీకొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం చిట్యాల మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌లోని తంగడపల్లికి చెందిన అయితగాని నరేష్ (25) చౌటుప్పల్ లోని పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తుండేవాడు.
అయితే బుధవారం ఉదయం చిట్యాల మండలంలోని వనపాకల గ్రామంలో గల పౌల్ట్రీ ఫారం వద్దకు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వచ్చి అనంతరం తిరిగి చౌటుప్పల్ కి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెలిమినేడు గ్రామ శివారులో గల జాతీయ రహదారి 65 పై, ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టాడు. దీంతో నరేష్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై రావుల నాగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.