శ్మశాన వాటికలోని ముళ్ల పొదల్లో మగశిశువు..

by Sumithra |   ( Updated:2021-08-16 08:53:29.0  )
శ్మశాన వాటికలోని ముళ్ల పొదల్లో మగశిశువు..
X

దిశ, కాళోజీ జంక్షన్: అప్ప్పుడే పుట్టిన మగ శిశువును సోమవారం వరంగల్ పట్టణంలోని శివ నగర్ శ్మశాన వాటికలో వదిలివెళ్లారు. ముళ్ల పొదల మధ్య.. ఒంటినిండా గాయలై పసికందు ఆర్తనాదాలు విన్న వరంగల్ నగర పాలక మున్సిపల్ సిబ్బంది వెంటనే పోలీసులు, బాలల సంరక్షణ అధికారులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న అధికారులు శివనగర్ స్మశాన వాటిక దగ్గరకి చేరుకొని ఘటనపై విచారణ చేపట్టారు. ఇదే సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడి శిశువును దత్తత తీసుకుంటామని అధికారులతో వాదించడం విశేషం. అయినప్పటికీ ససేమిరా అన్న అధికారులు శిశువును.. బాలల సంరక్షణ అధికారి జి.మహేందర్ రెడ్డికి అప్పజెప్పగా.. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story