- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ.2 వేల కోట్లు అప్పుచేసిన జగన్ సర్కార్
దిశ, ఏపీ బ్యూరో: జీతాలు అందక ఉద్యోగులు, పింఛన్ల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల అప్పు చేసింది. మంగళవారం రిజర్వ్‌బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్రం రూ.2వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణం స్వీకరించింది. 7.15% వడ్డీతో 16 ఏళ్లకు రూ.1,000 కోట్లు, 7.19% వడ్డీతో 17 ఏళ్లలో చెల్లించేలా మరో రూ.1,000 కోట్ల చొప్పున రుణం తీసుకుంది. ఈ మెుత్తం బుధవారం రాష్ట్ర ఖజానాకు జమ అయినట్లు తెలుస్తోంది. ఈ రుణం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపోతే ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు బహిరంగ మార్కెట్ ద్వారా రూ.17,000 కోట్ల అప్పు చేసింది. ఏప్రిల్ రూ.2 వేల కోట్లు, మే రూ.7వేల కోట్లు, జూన్ రూ. 6వేల కోట్లు, జూలై రూ. 2వేల కోట్లు రుణం తీసుకుంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలల్లో మెుత్తం రూ.17 వేల కోట్లు జగన్ సర్కార్ అప్పు చేసింది.