రికార్డులు బద్దలు

by Shyam |
రికార్డులు బద్దలు
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన టెస్టు మ్యాచ్ మూడో రోజు టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ పలు రికార్డులు బద్దలు కొట్టారు. శార్దుల్ ఠాకూర్ (67), వాషింగ్టన్ సుందర్ (62) కలసి ఏడో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యమైన బ్యాట్స్‌మెన్ విఫలమైనా లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఉన్న బౌలర్లు మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ తీసుకొని రావడమే కాకుండా పలు రికార్డులు కూడా సృష్టించారు. ఆస్ట్రేలియాలో 7వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అరంగేట్రం బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక పరుగల రికార్డును వాషింగ్టన్ సుందర్ (62) నెలకొల్పాడు. అంతకు ముందు ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా ఈ రికార్డును సృష్టించలేదు. ఇక అదే ఏడో వికెట్‌కు శార్దుల్, సుందర్ కలసి 123 పరుగులు జోడించారు. ఇది ఆసీస్‌లో మూడో అత్యుత్తమ భాగస్వామ్యం. అంకతు ముందు 2018-19లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కలసి 204, 1947-48లో విజయ్ హజారే, హెచ్ అధికారి కలసి 132, 1991-92లో అజారుద్దీన్, మనోజ్ ప్రభాకర్ కలసి 101 పరుగులు జోడించారు.

Advertisement

Next Story

Most Viewed