మనందరి కోసం.. మన తెలుగు ఇండస్ట్రీ

by Shyam |
మనందరి కోసం.. మన తెలుగు ఇండస్ట్రీ
X

భారత దేశంపై కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు, దాని వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం జనతా కర్ఫ్యూ విధించింది. మార్చి 22న ఉ.7 గంటల నుంచి రా. 9 గంటల వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. తద్వారా కరోనా ఎఫెక్ట్ తగ్గే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రేక్షకులు ఇంటి పట్టునే ఉండేలా తెలుగు హీరో హీరోయిన్స్ ఓ ప్లాన్ వేశారు. ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇంటి నుంచి కదలకుండా తమ వంతు ప్రయత్నం చేశారు. # Manandarikosam అనే హాష్ టాగ్ తో సోషల్ మీడియాలో లైవ్ చాట్ చేశారు.

ఉదయం. 7 గంటలకు మంచు లక్ష్మి ప్రసన్న తో మొదలైన లైవ్ చాట్ … రా. 8:30-9 వరకు రానా దగ్గుబాటి లైవ్ వీడియో తో ముగియనుంది. మొత్తం 28 మంది హీరో, హీరోయిన్లు పాల్గొంటున్న కార్యక్రమంలో ఒక్కొక్కరు అర్ధగంట లైవ్ చాట్ చేశారు. తమ వ్యక్తిగత విషయాలు, ప్రాజెక్టుల గురించి మాట్లాడిన వారు… అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వీరిలో నవదీప్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైశ్వాల్, నీహారిక కొణిదెల, మంచు మనోజ్, మంచు విష్ణు, విశ్వక్ సేన్, శ్రీయ శరణ్, కార్తికేయ, ప్రణీత సుభాష్, సందీప్ కిషన్ తో పాటు పలువురు హీరో హీరోయిన్లు ఉన్నారు. కాగా జనాన్ని ఇళ్లకు పరిమితం చేయడంలో భాగంగా తెలుగు కథానాయకులు, నాయికలు మనకోసం పేరుతో తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు అందుకున్నారు. ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తమ వంతు చేసే ప్రయత్నం గొప్పగా ఉంటుందని అభినందనలు అందుకున్నారు.

Tags: Manandarikosam, TFI, lakshmi Manchu, Rana Daggubati, Rakul Preet Singh, Manchu Manoj

Advertisement

Next Story

Most Viewed