పదో తరగతి పరీక్షలు వాయిదా

by Shyam |   ( Updated:2020-03-20 03:19:48.0  )
పదో తరగతి పరీక్షలు వాయిదా
X

కరోనా ఎఫెక్ట్ పదో తరగతి పరీక్షలపై పడింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని తాజాగా హైకోర్టు ఆదేశించింది. శనివారం జరగాల్సిన పరీక్షను యథాతథంగా నిర్వహించుకోవచ్చని సూచించింది. అయితే 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని హైకోర్టు తెలిపింది. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16కు చేరింది.

Tags: tenth exams, postponed, high court, ts news

Next Story