ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెండర్ ఓటు

by Shyam |
graduate MLC Election poling
X

దిశ, క్రైమ్ బ్యూరో: ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టెండర్ ఓటు దాఖలైంది. తార్నాక పోలింగ్ బూత్ నెం.480లో శ్రీధర్ (ఓటరు జాబితాలోని సీరియల్ నెం.1743) అనే గ్రాడ్యుయేట్ ఓటు వేసేందుకు వెళ్లగా.. అప్పటికే తన ఓటు వేరొకరు వేసినట్టుగా ఉండటంతో అవాక్కయ్యాడు. వెంటనే అక్కడున్న పోలింగ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆందోళన చేసేందుకు సిద్ధమవుతుండగా స్పందించిన అధికారులు శ్రీధర్‌తో టెండర్ ఓటు వేయించారు. ఓటరు జాబితాలో ఓటరు ఫొటో ఉన్నప్పటికీ, ఓటరు గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తనిఖీ చేయాల్సి ఉన్నా.. దొంగ ఓటు పడటంపై అధికారుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏ ఎన్నికల్లో అయినా టెండర్ ఓటు పడిందంటే ఆ బూత్‌లో దొంగ ఓట్లు పడినట్టుగానే భావిస్తారు. గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తయిన వారు మాత్రమే వేసే ఈ ఓట్లలో టెండర్ ఓటు వేయాల్సిన పరిస్థితులు కలగడం బాధాకరం అంటూ బాధిత ఓటరు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed