- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నుజ్జునుజ్జైన బైక్.. యువకుడి మృతి.. మృతుడి ఒంటిపై గాయాలేవి ?
దిశ, జడ్చర్ల: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గంగాపురం గ్రామానికి చెందిన గుదేటి అనిల్ కుమార్(25) గంగాపురం లింగంపేట్ రోడ్డులోని గంగాపురం గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని అనిల్ కుమార్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామానికి చెందిన అతని స్నేహితుడు సాయి పుట్టినరోజు వేడుకలు ఉన్నాయని, సాయంత్రం ఇంటి నుండి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. జన్మదిన వేడుకలు గంగాపురం గ్రామంలో జరుపుకుని అక్కడి నుండి రాత్రి 8 గంటల సమయంలో శేఖర్ అనే స్నేహితుడిని ద్విచక్రవాహనంపై లింగంపేట గ్రామంలో దింపి రావడానికి వెళ్లాడు. అక్కడ రాత్రి 10 గంటల సమయంలో కొంతమందితో గొడవ పడినట్లు తెలిపారు. రాత్రి ఇంటికి రాకపోగా ఉదయానికల్లా అనిల్ కుమార్ గంగపూర్ శివారులో మృతి చెంది ఉండటం, బైకు నజ్జునజ్జు అవ్వడం, మృతుడు అనిల్ కుమార్ పై ఎలాంటి గాయాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి అనిల్ కుమార్ తో గడిపిన స్నేహితులను, గొడవ పడిన వారిని విచారించాలని మృతుడి కుటుంబ సభ్యులు జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మృతుడి అన్న ఆశీర్వాదం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజేందర్ తెలిపారు.