- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'ఆడబిడ్డలను కేసీఆర్ తండ్రి లాగా చూసుకుంటున్నారు'
దిశ, ఎల్బీనగర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ముఖ్య పాల్గొని మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గజ్జల నగేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా పక్షపాతిగా, మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని, మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించారని, రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు మహిళల పేర్లు పెట్టారని గుర్తు చేశారు.
ఆడపిల్ల పుట్టినప్పటి నుండి పెళ్లి చేసే వరకు ముఖ్యమంత్రి ఒక అన్నగా, తండ్రిగా, మేనమమగా నిలిచారని అన్నారు. జీహెచ్ఎంసీలో మహిళలకు 75 శాతం మహిళా కార్పొరేటర్లకు అవకాశం ఇచ్చారని తెలిపారు. బేవరేజెస్ కార్పొరేషన్‌లో మహిళా సమస్యలు పరిష్కరించడానికి కృషి ప్రత్యేక చేస్తానని వెల్లడించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని సూచించారు. మహిళలు లేనిదే ప్రపంచమే లేదని, మహిళలందరూ ఎక్కడ గౌరవంగా జీవిస్తారో ఆ రాష్ట్రం, ప్రాంతం, ఇల్లు సుభిక్షంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బేవరేజస్ ఉద్యోగ సంఘం నాయకులు, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్, నాయకులు సురేందర్, విజయలక్ష్మి, అంశా, వినోద్, సతీష్, ఝాన్సీ, రేణుకా, విష్ణు ప్రియ, శిరీషా, వాణి, పుష్పలత, పద్మా తదితరులు పాల్గొన్నారు.