- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మేము చేయాల్సింది చేశాం: ఎగ్జిట్ పోల్స్‌పై ప్రియాంకా గాంధీ

లక్నో: యూపీ ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. రాష్ట్రంలో తాము చేయగలిగినంత చేశామని అన్నారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. లక్నో చేరుకున్న ప్రియాంక మంగళవారం మాట్లాడారు. మేము మహిళలు పోరాడగలము అనే ప్రచారంతో ఎన్నికల్లో పాల్గొన్నామని తెలిపారు. 'యూపీ నుంచి 159 మహిళ అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇది చాలా పెద్ద విషయం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం దీనిని సెలబ్రేట్ చేసుకోవాలి' అని అన్నారు. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మెజారీటీ రావాలంటే 202 స్థానాల్లో గెలవాల్సి ఉంది. కాగా తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ 20 లోపు స్థానాల్లోనే గెలుస్తుందని పేర్కొన్నాయి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తూ ప్రచారం చేసింది. అంతేకాకుండా మొత్తం స్థానాల్లో 40 శాతం మహిళలకే కేటాయించింది. కాగా, గురువారం ఫలితాలు వెలువడనున్నాయి.