పనికి వెళ్లిన మహిళ పత్తాలేదు.. ఏమైనట్టు ?

by Sridhar Babu |
పనికి వెళ్లిన మహిళ పత్తాలేదు.. ఏమైనట్టు ?
X

దిశ, వెల్గటూర్ : ధర్మపురి పట్టణానికి చెందిన సంకు భూలక్ష్మి (55) అనే మహిళ మంగళవారం అదృశ్యం ఆయిందని ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. ధర్మపురిలోని పలు ఇండ్లలో ఈమె పని చేసుకుని జీవిస్తుంది. రోజు మాదిరిగానే ఉదయం 6 గంటల సమయంలో పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. బయటకు వెళ్లిన మహిళ సాయంత్రం అయినా తిరిగి ఇంటికి రాలేదు. ఆమె గురించి ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఎక్కడో తప్పిపోయిం దని ఆమె కూతురు భూదారపు గంగజమున ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.

Next Story

Most Viewed