Vijay Devarakonda: ఈ సినిమా మంచి జ్ఞాపకాలను ఇస్తుంది.. రౌడీ హీరో కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2024-10-18 14:10:02.0  )
Vijay Devarakonda: ఈ సినిమా మంచి జ్ఞాపకాలను ఇస్తుంది.. రౌడీ హీరో కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ఈ ఏడాది ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. ఇప్పుడు ‘VD12’తో బిజీగా ఉన్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamshi), సాయి సౌజన్య (Sai Soujanya) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి (Gautam Tinnanuri) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ (Update) సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా షూటింగ్‌లో కూడా జోరు పెంచారు మేకర్స్.

ఈ క్రమంలోనే ఇటీవల కేరళ (Kerala)లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా.. అక్కడ ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఆయన మాట్లాడుతూ.. ‘ప్రకృతి అందాల మధ్య షూట్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇక్కడ యాక్షన్ సీన్స్ షూట్ చేశాము. ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్ (Special). ఎందుకంటే.. ఈ మూవీ అందరి మనసులకు దగ్గరవుతుంది.. అలాగే మచి జ్ఞాపకాలను ఇస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story