- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అండర్‌వేర్.. అంతకుమించి వాడితే యోని ఆరోగ్యంపై ప్రభావం
దిశ, ఫీచర్స్ : లైఫ్‌లో ప్రతిదానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అలాగే మనం ధరించే లోదుస్తులను కూడా నిర్దిష్ట వ్యవధి వరకే ఉపయోగించాలి. ప్రత్యేకంగా మహిళలు యోని ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు సూటబుల్, ఫ్రెష్ అండర్‌వేర్స్ వాడుతుండాలి. బిగ్గరగా, చాలా రోజులుగా వాడుతున్న, రాపిడితో కూడిన లోదుస్తులు ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఇవి యోని ప్రాంతాన్ని వెచ్చగా, తేమగా మార్చడం వల్ల ఆ ప్రాంతంలో సూక్ష్మక్రిములు పెరిగే అవకాశముంది. కాగా ఈ పరిస్థితుల నుంచి యోని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న టిప్స్..
* లోదుస్తులు శుభ్రం చేసేందుకు అదనంగా జెర్మ్ కిల్లింగ్ ప్రొడక్ట్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా వాషింగ్ మెషిన్లలో సూక్ష్మక్రిములను చంపగలిగే ఇన్‌గ్రెడియెంట్స్ ఉంటున్నాయి. కాబట్టి వీటిని సాధారణ వేడి నీటితో ఉపయోగించవచ్చు.
* మీ లోదుస్తులు సున్నితమైన మెటీరియల్‌తో తయారు చేసినట్లయితే చేతితో వాష్ చేయాలి. అటువంటి సందర్భంలో జెర్మ్స్ నిరోధించేందుకు యాంటీ బాక్టీరియల్ వాష్ ఉపయోగించాలి. ఆ తర్వాత ఎండలో ఆరబెట్టాలి. ఇది బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సాయపడుతుంది.
* చాలా బిగుతుగా, అపరిశుభ్రంగా లేదా పాతబడిన లోదుస్తులు ముఖ్యంగా మెనోపాజ్ దశలో యోనిని చికాకు పెట్టవచ్చు. E.coli బ్యాక్టీరియా(సాధారణంగా ప్రేగులలో నివసించే బ్యాక్టీరియా రకం) కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. మీకు ఇప్పటికే యోని సమస్యలు లేదా అటువంటి ఇన్ఫెక్షన్ చరిత్ర ఉంటే పాతబడ్డ లోదుస్తులు ఆ సమస్యను మరింత జఠిలం చేస్తాయి.
* లోదుస్తులను ఆరు నెలలకు మించి ఉపయోగించవద్దు. ఎందుకంటే ఉతికి, ఎండబెట్టిన తర్వాత కూడా పాతబడ్డ లోదుస్తులు ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.
* కాటన్ లేదా కాటన్ ప్యాడ్ ఆధారిత లోదుస్తులనే ధరించాలి. అవి తేమ త్వరగా పెరగకుండా నిరోధిస్తాయి. కానీ నైలాన్, స్పాండెక్స్ వంటి సింథటిక్ పదార్థాలు తేమను పట్టుకునే ధోరణి కలిగి ఉంటాయి. ఇక ఫ్యాన్సీ లేస్డ్ లోదుస్తుల తయారీకి ఉపయోగించే మెటీరియల్ ఉత్తమం కాదు. ఇది అసౌకర్యం, నొప్పి రెండింటినీ కలిగిస్తుంది.