- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Monkeypox: మంకీపాక్స్ ఎఫెక్ట్: అమెరికాలో 'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ'
దిశ, వెబ్‌డెస్క్: US Declares Monkeypox a Public Health Emergency| గత మూడేళ్లుగా కరోనాతో యావత్ ప్రపంచం వణికిపోతోంది. ఇంకా కరోనా సమస్య తొలగిపోకముందే మరో వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. అదే మంకీపాక్స్. ఇప్పటికే పలు దేశాల్లో రోజురోజుకూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే, ఈ క్రమంలో అమెరికా మంకీపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇది కొత్తగా నిధులను ఖర్చు చేయడం, డేటా సేకరణలో సహాయం చేయడం, మంకీపాక్స్‌కు వ్యతిరేకంగా పోరాటంలో అదనపు సిబ్బందిని మోహరించడానికి అనుమతించే చర్యగా ఉండనుంది. "ఈ మంకీపాక్స్ వైరస్‌ను పరిష్కరించడంలో మా ప్రతిస్పందనను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
మంకీపాక్స్‌ను తీవ్రంగా పరిగణించాలని, ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో మాకు సహాయపడటానికి బాధ్యత వహించాలని మేము ప్రతి అమెరికన్‌ను కోరుతున్నాము" అని అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి జేవియర్ బెకెరా తెలిపారు. అమెరికాలో సుమారు 6600 కేసులు నమోదు అయ్యాయి. దీంట్లో మూడో వంతు కేసులు న్యూయార్క్‌లో బయటపడ్డాయి. ఆ రాష్ట్రం స్వంతంగా ఎమర్జెన్సీ ప్రకటించుకుంది. కాలిఫోర్నియా, ఇలియాస్‌లోనూ అధిక కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 26వేల కేసులు నమోదు అయినట్లు అమెరికా అంటువ్యాధుల సంస్థ సీడీసీ చెప్పింది.
ఇది కూడా చదవండి:
- Tags
- Monkeypox