- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kishan Reddy: యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ సర్కార్ ధాన్యం కొనుగోళ్లపై లేని సమస్యను ఉన్నట్లు చూపిస్తోందని అన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వ రాతపూర్వకంగా రాసిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం బాయిల్డ్ రైస్ ఎవరు తినడం లేదని పేర్కొన్నారు. గత సీజన్‌లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇంకా బియ్యం ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ లేని సమస్యను సృష్టించారని ఫైర్ అయ్యారు. వాస్తవాలను వక్రీకరించి టీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తున్నారని తెలిపారు. బాయిల్డ్ రైస్ సేకరణను ఎఫ్‌సీఐ నిలిపివేసిందని వెల్లడించారు. ఇప్పుడైనా రా రైస్ ఎంత ఇచ్చినా కేంద్రం కొంటుందని చెప్పారు. రా రైస్ కేంద్రానికి ఇచ్చి, నూకలు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలన్నారు.
Advertisement
Next Story