- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'ఇక నియామకాలు చేయకండి.. ఆ నియామకాలు కూడా చెల్లవు'
by GSrikanth |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు అనుబంధ విభాగాల్లోనూ ఎలాంటి నియామకాలు జరపొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆర్గనైజేషన్ ఇన్‌చార్జి మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పీఏసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి నియామకాలు జరపవద్దని ఆయన సూచించారు. అంతేగాక, ఇటీవల కాలంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక జరిపిన ఏ నియామకాలు చెల్లవని, సంస్థాగత ఎన్నికల తర్వాత అన్ని నియామకాలు మళ్ళీ నూతనంగా నియమిస్తామని ఆయన వివరించారు.
Next Story